Monday, October 27, 2008

అయినా.....






అయినా మళ్ళీ నిద్ర వద్దు
నిన్నటి కల ఇంకా పచ్చిగానే ఉంది
నాటకానికి తెరపడే సరికి
ఎక్కడో మొదలయిన గాలి దుమారం
మేఘాల్ని మోసుకొచ్చి
కళ్ళల్లో నింపుతుంది
గాలికి రెప రెపలాడుతూ
కిటికీలు మూత పడిపోతాయి
ఎపుడో వాడిపోయిన
జ్నాపకాల పూల మీద
రంగునీళ్ళు చల్లి
సీతాకోకచిలుకల్ని బుట్టల్తో
మోసుకొస్తుంది కల
తీరని కోరికల తీరాల్ని
చేరుస్తుంది కల
వేయి ప్రశ్నల
సమాధానం కల
చీకట్లని ముంచిన
వెలుగు వెల్లువ కల
సహశ్ర వేదనల
లేపనం కల
నిన్నటి నిద్ర నన్ను
నిర్వీ ర్యుణ్ణి చేసి వెళ్ళిపోయింది
నిన్నటి కల ఇంకా పచ్చిగానే ఉంది
అయినా మళ్ళీ నిద్ర వద్దు...

1 comment:

Bolloju Baba said...

జీవన యానంలో కలల ముక్కలు ఏరుకొని జేబులు నింపుకొనే స్వాప్నికుడే కవి.

అనుభవాల కొండ చరియలు హృదయపులోయల్లోకి జారి పడినపుడు, కలల ప్రతిధ్వనులను ఒడిసిపట్టుకొని బంధించేవాడే కవి.

కవిత లో ఆ ప్రయత్నం సమర్ధవంతంగా వ్యక్తీకరింపబడ్డది.
చాలా బాగుంది.