Saturday, May 17, 2008

మొక్కలు మొలవకుండానే...

మొక్కలు మొలవకుండానే...

మొక్క మొలవకుండానే కొందరికి
కోరికల ముళ్ళు పుట్టేస్తాయి
బుడి బుడి నడకలు
పడుతూ లేస్తూనో
లేస్తూ పడుతూనో
వడి వడిగా బడిలో
అడుగు పెడ్తాయి
ఇదొక మేధావుల ఖార్ఖానా
యోధుల కర్మాగారం
అక్ష రాభ్యాసం నుండే
అవిశ్రాంత పోరాటం
క్లాసులో బెంచీలకి కాళ్ళని కట్టేసి
పరుగు పందాలకి తర్ఫీదునిస్తారు
టన్నులకొద్దీ మేధస్సుని
మెదళ్ళ నిండా కుక్కేస్తారు
కన్నవారి కలలు సాకారం చేసే
యంత్రాలు ఈ చిన్నారులు....
వారి ఊహల్లో బందీ లయిన
స్వేచ్చారహిత విగతలు...
బంగారు పంజరాల్లో
వెలిగి పోతున్న డాలర్లు...
పెట్టుబడి దార్ల ఇనుప కౌగిలి లో
ప్రేమ పాశానికి వేలాడుతున్న
బాల కార్మికులు వీరు...
వారి ఆశల శిలువల్ని
మోసుకు పోతున్న బాల ఏసులు...
పోటీ ప్రపంచ భూతం
పాలబుగ్గల బాల్యాన్ని
ము క్క ముక్కలుగా తినేస్తుంటే
గుజ్జన గూళ్ళు, గోటిబిళ్ళల కోసం
"గూగుల్" సెర్చిలో వెతుక్కోవ ల్సిందే!

ఆత్మ సమర్పణ

ఆత్మ సమర్పణ

స్వేచ్చ్న ని కంచు కోటల్లో
పావు రాల్ని పంజ రాల్లో
పరిరక్షించుకోవాల్సిన పరిస్తితుల్లో
సర్వం సమర్పించుకోవాల్సిందే
మతం ముల్లుని గుండెల్లో గుచ్చి
పచ్చి నెత్తురు కంపు కొడుతున్న
సిధ్దాంతాలకి వీధి వీధినా....
ఒక "ధియోవాన్ గోహ్"
కాగడా పట్టి తిరగాల్సిందే...
విశ్వాసానికి విశ్వ్సనీయతలేనపుడు...
ఆలయాల్లో ఆరాధనలు కాదు
ఆర్త నాదాలు వినిపిస్తాయి
గోడలు పచ్చ్గగా ఉంటేనేం....
గుండెల్లో ప్రేమ లేనపు డు
స్త్రీ స్వేచ్చ ని కాలరాసిన
ఏ సిధ్ధాంతమూ మనలేదు
ఇంకెంతమంది కన్యాత్వపంజరంలో
ఉరివేయ బడాలో....
ప్రేమ లోని విశ్వాసాన్ని
నీ పవిత్ర గ్రంధం చంపేసింది
ఇంకెంతమంది
"అయాన్ హిర్సి ఆలీ" లు
బాధలసముద్రాల్నిభుజాలకెత్తుకొని
ఆత్మ సమర్పణ గావించబడాలో
నన్ను నేను సమర్పించుకోవడమంటే..
నాకు నేను
ద్రోహం చేసుకో్వడమేకాదు..
నీ అస్థిత్వాన్ని
నువు కోల్పోవడం కూడా..
(ఆం ధ్ర జ్యోతి 12.05.2008..వివిధ లోని..
"ఆత్మసమర్పణ"కు అసలయిన అర్ధం " అన్న వ్యాసం చదివాకా..)

Sunday, May 11, 2008

తస్మాత్ ! జాగ్ర త్త

తస్మాత్ ! జాగ్రత్త
పాత ముఖాలు లోపలికి పోయి
లోపలి నుండి బ య టికి
కొ త్త ము ఖాలు మొ లుస్తాయి
మొండెం లేని ముఖాలు
గాలి బు డగ ల్లా మనచుట్టూ
అవ స రాలని వెతుక్కుంటూ
అవకాశాల్ని కురిపిస్తాయి....
మెత్త గా స్పృశించి మత్తులో దించి
ఉరికంబాల సాక్షిగా
ఆశ లకి నిను ఊడిగం చేయిస్తాయి
వీటి భాష వేరు, భావం వేరు
న వ్వు తూ విషాన్ని చిమ్ముతాయి
విధ్వంసాలు స్రుష్టి స్తాయి....
జంక్షన్ లోనో ఫంక్ష న్ లోనో
ఎ క్కడ పడి తే అక్కడ
ఒకింత సామోజిక స్ప్రుహ
మరి కొంత జాలి ద య
అరుగు మీది అవ్వ ల్ని అక్కున చేర్చుకుని
అద్దె కు తెచ్చి న అభి మానాల్ని

పులుముకున్న ప్రేమల్ని
కురిపించి, మరిపించి
సగ టు సమీకరణాల్ని
తారుమారు చేసి
బల హీన త లకి బలానిచ్చి
నీకు సలాం చేస్తాయి
వేటగాడి కి లేడిపై
జాలి ఉం డదు సుమా
వేటు పడక ముందే మేలు కో
చేత న యి తే తరిమి కొట్టు
కాక పోతే పరుగు పెట్టు ....

Friday, May 9, 2008

నీదయిన దాన్ని నీది కాదని...
వెన్ను ని నాగల్ని చేసి..
గుప్పెడు ఆశల్ని
ఒకటొకటిగా నాటుకుంటూ
వేలి సందుల్లొంచి దారాల్ని మలిపి
పచ్ఛ ని చీర చూసి మురిసి పొతూంటె
స్త న్య మందించిన తన్మయత్వాన్ని
ఎవ రో త న్నుకు పోయినట్లు
నీద యిన దాన్ని నీది కాద ని
నీనుండి వేరుచేస్తూంటే...
క బ్జా కోరల్లొ చిక్కు కున్న
ఓ రైతన్న మేలుకో
కలు పు మొక్కల్ని కాలి కిందేసి
తొ క్కటం నీకు కొత్తేమీ కాదు ...
చీడ మొ క్కల్ని పీకి
చ లి మంటేసు కోవ టం
నీకు తెలియంది కాదు
మీవెనుక మేమున్నాం
మా అక్షరం ....
ఒక సాహ సం , ఒక ఆయుధం ,ఒక యుధ్ధం
రా! కదలిరా!
నడుం బి గించి కొడవలి చేతబట్టి రా!
నీతో మేముటాం ........