Sunday, May 11, 2008

తస్మాత్ ! జాగ్ర త్త

తస్మాత్ ! జాగ్రత్త
పాత ముఖాలు లోపలికి పోయి
లోపలి నుండి బ య టికి
కొ త్త ము ఖాలు మొ లుస్తాయి
మొండెం లేని ముఖాలు
గాలి బు డగ ల్లా మనచుట్టూ
అవ స రాలని వెతుక్కుంటూ
అవకాశాల్ని కురిపిస్తాయి....
మెత్త గా స్పృశించి మత్తులో దించి
ఉరికంబాల సాక్షిగా
ఆశ లకి నిను ఊడిగం చేయిస్తాయి
వీటి భాష వేరు, భావం వేరు
న వ్వు తూ విషాన్ని చిమ్ముతాయి
విధ్వంసాలు స్రుష్టి స్తాయి....
జంక్షన్ లోనో ఫంక్ష న్ లోనో
ఎ క్కడ పడి తే అక్కడ
ఒకింత సామోజిక స్ప్రుహ
మరి కొంత జాలి ద య
అరుగు మీది అవ్వ ల్ని అక్కున చేర్చుకుని
అద్దె కు తెచ్చి న అభి మానాల్ని

పులుముకున్న ప్రేమల్ని
కురిపించి, మరిపించి
సగ టు సమీకరణాల్ని
తారుమారు చేసి
బల హీన త లకి బలానిచ్చి
నీకు సలాం చేస్తాయి
వేటగాడి కి లేడిపై
జాలి ఉం డదు సుమా
వేటు పడక ముందే మేలు కో
చేత న యి తే తరిమి కొట్టు
కాక పోతే పరుగు పెట్టు ....

5 comments:

Bolloju Baba said...

చాలా బాగుంది మీ కవిత
అమానవీయ ప్రపంచంలో జరిగే మోసాలు, ఘోరాలు, కాళ్ల క్రింద గోతులు తవ్వటాలు చాలా బాగా అక్షరబద్దం చేసారు.
కొన్ని అక్షరదోషాలు సవరించగలరు
తస్ మాత్
బ య టికి, అవ స రాలని జం క్షన్ణోనో ఫం క్ష న్లోనో(స్పేస్లు ఎక్కువయ్యాయి)
స్ప్రఋ

స్రుష్టి స్తాయి.... సృష్టిస్తాయి "sRshTistaayi)

Kranthi M said...

మొదటిసారిగా చుస్తున్నానండి మీ బ్లాగు కాని మీ కవిత నన్ను ఇక్కడే కట్టి పడేసింది.చాలా బాగుంది.ఇలాంటి ఫీలింగ్ తోనే నేను కూడా రాసాను కాని మీ అంత గొప్పగా కాదులెండి.

http://www.srushti-myownworld.blogspot.com/

చైతన్య.ఎస్ said...

చాలా బాగుంది మీ 'తస్మాత్ ! జాగ్ర త్త'

saisahithi said...

బాబా గారి కి,
మీ స్పందనకు ధన్యవాదములు,
తెలుగు టైపింగు అలవాటు లేక కొన్ని ముద్రారాక్షసాలు దొర్లినవి.తెలియజేసినందుకు ధన్యవాదములు.

saisahithi said...

చైతన్య గారికి
ధన్యవాదములు. మీ కవితలు చూసాను. చిన్న చిన్న పదాలతో అల్లిన పూల మాలల్లా చక్కటి అర్ధమనే సువాసన వెదజల్లుతూ చాలా బాగున్నాయి.