Saturday, May 17, 2008

ఆత్మ సమర్పణ

ఆత్మ సమర్పణ

స్వేచ్చ్న ని కంచు కోటల్లో
పావు రాల్ని పంజ రాల్లో
పరిరక్షించుకోవాల్సిన పరిస్తితుల్లో
సర్వం సమర్పించుకోవాల్సిందే
మతం ముల్లుని గుండెల్లో గుచ్చి
పచ్చి నెత్తురు కంపు కొడుతున్న
సిధ్దాంతాలకి వీధి వీధినా....
ఒక "ధియోవాన్ గోహ్"
కాగడా పట్టి తిరగాల్సిందే...
విశ్వాసానికి విశ్వ్సనీయతలేనపుడు...
ఆలయాల్లో ఆరాధనలు కాదు
ఆర్త నాదాలు వినిపిస్తాయి
గోడలు పచ్చ్గగా ఉంటేనేం....
గుండెల్లో ప్రేమ లేనపు డు
స్త్రీ స్వేచ్చ ని కాలరాసిన
ఏ సిధ్ధాంతమూ మనలేదు
ఇంకెంతమంది కన్యాత్వపంజరంలో
ఉరివేయ బడాలో....
ప్రేమ లోని విశ్వాసాన్ని
నీ పవిత్ర గ్రంధం చంపేసింది
ఇంకెంతమంది
"అయాన్ హిర్సి ఆలీ" లు
బాధలసముద్రాల్నిభుజాలకెత్తుకొని
ఆత్మ సమర్పణ గావించబడాలో
నన్ను నేను సమర్పించుకోవడమంటే..
నాకు నేను
ద్రోహం చేసుకో్వడమేకాదు..
నీ అస్థిత్వాన్ని
నువు కోల్పోవడం కూడా..
(ఆం ధ్ర జ్యోతి 12.05.2008..వివిధ లోని..
"ఆత్మసమర్పణ"కు అసలయిన అర్ధం " అన్న వ్యాసం చదివాకా..)

2 comments:

Bolloju Baba said...

స్వేచ్చ 'svEcca" పరిస్థితుల్లో "paristhitullO" విశ్వసనీయత "viSvasanIyata" పచ్చగా "paccagaa"

ఆఖరున నన్నునెను సమర్పించుకోవటం అంటే ... లో నీ అస్థిత్వాన్ని నువ్వుకోల్పోవటమా లేక నా అస్థిత్వాన్ని నేను కోల్పోవటమా? కొంచెం వివరించగలరు.

saisahithi said...

బాబా గారికి
మీ స్పందనకు ధన్యవాదములు,
ఇస్లాం మతానుసారం ఎవరైనా పాపం చేసింట్లయితే వారు ప్రతిరోజు నిర్వహించే నమాజులలో వారి ఆత్మని అల్లాకి సమర్పించు కొని పరిసుద్ధతగావించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రచయిత రాసిన కధలో ఒక అబలకి మతాన్ని అడ్డుగా పెట్టి ఇష్టం లేని పెళ్ళి చేస్తారు. ఆమె ప్రియుడి పట్ల పవిత్ర ప్రేమని పాపంగా నిందించి ఆమెని బలవంతంగా ఆత్మసమర్పణ గావించ మంటారు. ఆ సమయం లో ఆమె లో జరిగిన ఆత్మ సంఘర్షణగా ఈ కవితను భావిస్తున్నాను. ఏ మతమూ ప్రేమ నేరమని అనలేదు. ఆమె ప్రేమని నేరమన్న మతం(మతాధికారులు)అస్థి త్వం కోల్పోతున్నట్లే కదా. ఈ కధనం వివరాలకోసం కవితలో ఇచ్చిన ఆంధ్రజ్యో తి దినపత్రిక చూడగలరు