మొక్కలు మొలవకుండానే...
మొక్క మొలవకుండానే కొందరికి
కోరికల ముళ్ళు పుట్టేస్తాయి
బుడి బుడి నడకలు
పడుతూ లేస్తూనో
లేస్తూ పడుతూనో
వడి వడిగా బడిలో
అడుగు పెడ్తాయి
ఇదొక మేధావుల ఖార్ఖానా
యోధుల కర్మాగారం
అక్ష రాభ్యాసం నుండే
అవిశ్రాంత పోరాటం
క్లాసులో బెంచీలకి కాళ్ళని కట్టేసి
పరుగు పందాలకి తర్ఫీదునిస్తారు
టన్నులకొద్దీ మేధస్సుని
మెదళ్ళ నిండా కుక్కేస్తారు
కన్నవారి కలలు సాకారం చేసే
యంత్రాలు ఈ చిన్నారులు....
వారి ఊహల్లో బందీ లయిన
స్వేచ్చారహిత విగతలు...
బంగారు పంజరాల్లో
వెలిగి పోతున్న డాలర్లు...
పెట్టుబడి దార్ల ఇనుప కౌగిలి లో
ప్రేమ పాశానికి వేలాడుతున్న
బాల కార్మికులు వీరు...
వారి ఆశల శిలువల్ని
మోసుకు పోతున్న బాల ఏసులు...
పోటీ ప్రపంచ భూతం
పాలబుగ్గల బాల్యాన్ని
ము క్క ముక్కలుగా తినేస్తుంటే
గుజ్జన గూళ్ళు, గోటిబిళ్ళల కోసం
"గూగుల్" సెర్చిలో వెతుక్కోవ ల్సిందే!
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
you typed my blog wrongly. this is the correct link. pl change. copy paste it.
http://sahitheeyanam.blogspot.com/
@ కమల ప్రసాద్ గారు
మీరు చాలా వైవిధ్యంగా, విభిన్నాంశాల మీద తేలికగా రాయగలుగుతున్నారు. ఈ కవిత కూడా చాలా బాగుంది.
"మొక్క మొలవకుండానే కొందరికి
కోరికల ముళ్ళు పుట్టేస్తాయి " తరవాత ఒక ఖాళీ వరస వదిలి ఉండాల్సింది. నాకు ఆ వరస చదవి వెంటనే
"బుడి బుడి నడకలు
పడుతూ లేస్తూనో
లేస్తూ పడుతూనో
వడి వడిగా బడిలో
అడుగు పెడ్తాయి" చదివి అన్వయించుకోడానికి కొంచెం సమయం పట్టింది.
MITRAMA,
NIJANNI PALIKINCHARU.
CHALA BAGUNDI.
MANASUKU HATTHU KUNDI.
MEERU www.telugupeople.com mariyu www.teluguone.com lo cheri ee kavithalanu pampithe baguntundani aashistunnanu.
--MUDIUM.SAIPRASAD Camp @USA.
Post a Comment